AP News: సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పెద్దిరెడ్డి

తాజా వార్తలు

Published : 19/09/2021 19:10 IST

AP News: సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారు: మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి: పరిషత్‌ ఎన్నికల్లో సంక్షేమ పథకాలకే ప్రజలు పట్టం కట్టారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం జగన్‌ పాలనకు ఏకపక్షంగా మద్దతు పలికారని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు తెదేపాతో పాటు ఇతర పార్టీలకు చెంపపెట్టన్నారు. ‘‘రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టారు. గత ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవీ నేరవేర్చలేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లలోనే అమలు చేసి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. సీఎం పరిపాలన ఈ ఎన్నికల్లో ప్రతిబింబించింది’’ అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని