Dalit bandhu: దళిత బంధు కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదు: వినోద్‌కుమార్‌

తాజా వార్తలు

Published : 02/08/2021 01:14 IST

Dalit bandhu: దళిత బంధు కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదు: వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న దళిత బంధు పథకం ఆరు నెలల కిందటనే రూపుదిద్దుకున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు. రవీంద్రభారతిలో జరిగిన సాంస్కృతిక సారథి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా వ్యూహరచన చేస్తున్నట్లు చెప్పారు. దళితుల విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం దళిత బంధు పథకానికి రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత సాధికారత కోసం రూ. వెయ్యి కోట్లు నిధులు సీఎం కేసీఆర్ కేటాయించినట్లు వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన పథకం కాదన్నారు. ఈ పథకాన్ని రాజకీయ కోణంలో కాకుండా.. దళితుల అభ్యున్నతిని కాంక్షించి ప్రవేశపెట్టిన పథకంగా చూడాలని కోరారు. కొవిడ్ మహమ్మారి ప్రభావం వల్ల ఈ పథకం అమలులో జాప్యం జరిగిందన్నారు. రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించిన విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు పోషించిన పాత్ర మరువలేనిదని.. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సాంస్కృతిక సారథి ద్వారా కళాకారులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని