Revanth reddy: గాంధీ కుటుంబంపై కేంద్రం కక్షసాధిస్తోంది: రేవంత్‌

తాజా వార్తలు

Published : 21/08/2021 01:26 IST

Revanth reddy: గాంధీ కుటుంబంపై కేంద్రం కక్షసాధిస్తోంది: రేవంత్‌

హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కమిటీ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రేవంత్‌ మాట్లాడుతూ... ‘‘దేశ యువతకు ఐకాన్‌ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ. రాజకీయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, యువతకు అవకాశాలు కల్పించి స్ఫూర్తి ఇచ్చిన నేత. రాజ్యాంగ సవరణ చేసి 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు కల్పించారు. దేశాభివృద్ధిలో యువతదే ప్రధాన భూమిక అని విశ్వసించిన నేత. రాజీవ్‌ గాంధీ మంత్రివర్గంలో యువతకు 40శాతం అవకాశం ఇచ్చారు. దేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చిన నేత రాజీవ్‌గాంధీ పేరిట ఏర్పాటు చేసిన రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం తొలగించడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష సాధిస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌ గాంధీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన బాడీ బిల్డింగ్‌ పోటీలు ఆకట్టుకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని