RS Praveen kumar: నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ

తాజా వార్తలు

Published : 08/08/2021 18:55 IST

RS Praveen kumar: నల్గొండలో రాజ్యాధికార సంకల్ప సభ

నల్గొండ: నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ ప్రారంభమైంది. తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని, సుమారు లక్షమందితో సభ నిర్వహిస్తానని ఇటీవలే ప్రకటించిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ సభ ద్వారా బీఎస్పీలో చేరనున్నారు. గత ఏడేళ్లుగా ప్రవీణ్‌ కుమార్‌ గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. మర్రిగూడ బైపాస్‌ వద్ద అంబేడ్కర్‌, జగ్జీవన్‌ విగ్రహాలకు  నివాళులర్పించిన అనంతరం అక్కడి నుంచి  సభ జరిగే ఎన్జీ కళాశాల మైదానం వరకు డప్పు కళాకారులు, కోలాటాలతో ర్యాలీగా ముఖ్యనేతలు సభాస్థలికి చేరుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని స్వేరోస్‌ కార్యకర్తలతో పాటు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి బీఎస్పీ పార్టీ సభ్యులు తరలివచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని