ts politics: రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చడం దారుణం: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 07/08/2021 05:00 IST

ts politics: రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చడం దారుణం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్చి ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డుగా నామకరణం చేయడం దారుణమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇది భాజపా పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దేశంలో క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ రాజీవ్‌గాంధీ పేరు ఖేల్‌రత్నగా ఉండడం సముచితమన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకొని రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డు కొనసాగించాలన్నారు. రాజీవ్‌గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని రేవంత్‌రెడ్డి కొనియాడారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని