Revanth reddy: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేయండి.. పార్టీ అధికార ప్రతినిధులకు రేవంత్‌ సూచన

తాజా వార్తలు

Published : 24/09/2021 01:26 IST

Revanth reddy: ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేయండి.. పార్టీ అధికార ప్రతినిధులకు రేవంత్‌ సూచన


హైదరాబాద్‌: రాజకీయాల్లో పార్టీ అధికార ప్రతినిధుల పాత్ర ఎంతో కీలకమని.. వారంతా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ప్రతిష్ట పెంచి బలోపేతం చేయడంలో అధికార ప్రతినిధులు ఎప్పుడూ ముందుండాలన్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ పార్లమెంట్ కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారంతా నిత్యం.. ప్రతి అంశంపైనా అధ్యయనం చేయాలని సూచించారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించాలని దిశా నిర్ధేశం చేశారు. రాజకీయాల్లో కష్టపడే వారికి మంచి ఫలితాలు ఉంటాయని.. అవకాశం వచ్చినప్పుడు ప్రతిభను నిరూపించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా పనిచేసిన వారు ఎన్నో కీలకమైన పదవులు పొందారని.. నిరంతర అధ్యయనంతోనే గుర్తింపు లభిస్తందన్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, సురేష్ షెట్కార్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కో-ఆర్డినేటర్ అయోధ్య రెడ్డి, సీనియర్ అధికార ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని