Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

తాజా వార్తలు

Updated : 13/09/2021 16:35 IST

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి హత్యాచారం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎందుకు నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయలేకపోయారని ప్రశ్నించారు. సింగరేణి కాలనీలో చిన్నారి కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. పార్టీ తరఫున కొంత ఆర్థిక సాయం అందించారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్నత వర్గాలకు న్యాయం చేస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తోంది. గిరిజన బిడ్డలు తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఈ ఘటనపై ఒక్క మంత్రి కూడా స్పందించలేదు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఏమాత్రం మానవత్వం లేదని తేలిపోయింది. మితిమీరిన మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాల వాడకం ద్వారానే ఇలాంటి దారుణాలు జరుతుగున్నాయి. సింగరేణి కాలనీని దత్తత తీసుకున్న హోంమంత్రి ఎందుకు సందర్శించడం లేదు? ఈ కేసు విషయంలో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని రేవంత్‌ అన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని