Revanth reddy: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Published : 25/08/2021 17:28 IST

Revanth reddy: కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో టీపీసీసీ ఆధ్వర్యంలో 48 గంటల దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష బుధవారం సాయంత్రం ముగిసింది.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘కేసీఆర్‌కు తొలిసారి ఓటమి భయం పట్టుకుంది. ఓటమి భయంతోనే కేసీఆర్‌ హామీలు కరిపిస్తున్నారు. 20ఏళ్లు అధికారం అన్నప్పుడే కేసీఆర్‌కు ఓటమి ఖాయమైంది. తెరాస కార్యవర్గ భేటీ తర్వాత ఎవరూ మీడియా ముందుకు రాలేదు. కేసీఆర్‌ ఆవేదన చూసి కేటీఆర్‌ మీడియా సమావేశం పెట్టారు. నేను నిన్న రాత్రి బస చేసిన ఇల్లు ఇందిరమ్మ కాలానిది. మూడుచింతలపల్లిలో కేసీఆర్‌ హామీలు అమలు కాలేదు. దళితబంధు అందరికీ ఇవ్వాలనేదే మా డిమాండ్‌. దళితబంధుకు నిధుల కోసం ఏదైనా అమ్మేద్దాం. దళితబంధు కోసం సచివాలయం, అసెంబ్లీ అమ్ముదాం. జీహెచ్‌ఎంసీలో వరద బాధితులను కేసీఆర్‌ మోసం చేశారు. వరద బాధితులకు రూ.10వేలు ఇస్తామని ఇవ్వలేదు. రూ.10వేలే ఇవ్వలేదు.. రూ.10లక్షలు ఇస్తారా?’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని