Revanth reddy: జడ్చర్ల వద్ద రేవంత్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత

తాజా వార్తలు

Updated : 12/10/2021 19:07 IST

Revanth reddy: జడ్చర్ల వద్ద రేవంత్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థి నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ సభలో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. జడ్చర్ల వద్దకురాగానే పోలీసులు కాంగ్రెస్‌ నేతల కార్లను అడ్డుకున్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ వెళ్లకుండా నేరుగా అమిస్తాపూర్‌ సభాస్థలికి వెళ్లాలని సూచించారు. జడ్చర్ల పట్టణ శివారులో బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. జడ్చర్ల వెళ్లకుండా ఫ్లైఓవర్‌ మీదుగా వెళ్లాలని ఆదేశించారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు బారికేడ్లను తొలగించారు. ఈక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి జడ్చర్ల మీదుగానే రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ బయల్దేరారు.

రేవంత్‌కు ఘన స్వాగతం పలికి కాంగ్రెస్‌ శ్రేణులు

మహబూబ్‌నగర్‌ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన రేవంత్‌రెడ్డికి దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. శంషాబాద్‌, షాద్‌నగర్‌, బాలానగర్‌, రాజపూర్‌, జడ్చర్లలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని