Andhra Pradesh Politics: భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా?: సజ్జల

తాజా వార్తలు

Updated : 03/08/2021 14:34 IST

Andhra Pradesh Politics: భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా?: సజ్జల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనేది అందరికీ తెలుసునని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రూ.3లక్షల కోట్ల అప్పులకు కొవిడ్‌ సంక్షోభం తోడైందన్నారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ ఆర్థిక కష్టాలు, సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు వెచ్చించడం వల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ సంక్షోభం విషయం ఉద్యోగులకు తెలుసునని.. అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల అమలుకు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా అనేది భాజపా నేతలు చెప్పాలన్నారు. భాజపా నేతల విమర్శలు వారి దివాళాకోరుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. భాజపా వాళ్లు అప్పు చేయడం ఒప్పు.. మేము చేయడం తప్పా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకొచ్చే ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని