AP news: 85 శాతానికిపైగా స్థానాలు గెలిచాం: సజ్జల రామకృష్ణారెడ్డి

తాజా వార్తలు

Published : 19/09/2021 20:06 IST

AP news: 85 శాతానికిపైగా స్థానాలు గెలిచాం: సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో 85 శాతానికిపైగా స్థానాలు గెలిచామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ తరఫున, సీఎం జగన్‌ తరఫున ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి పాలనకు ప్రజలిచ్చిన గౌరవమే ఈ విజయమని ఆయన వెల్లడించారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుని ఆశీస్సులు ఇస్తారో ఈ ఎన్నికల ఫలితాలతో మరోసారి వ్యక్తమయ్యింది. ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని