Ap news: పవన్‌.. హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ గురించి మాట్లాడతారా?: సజ్జల

తాజా వార్తలు

Updated : 24/09/2021 21:55 IST

Ap news: పవన్‌.. హైదరాబాద్‌లో కూర్చొని ఏపీ గురించి మాట్లాడతారా?: సజ్జల

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. హైదారాబాద్‌లో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడటం.. ఏదైనా జరిగితే తానొస్తానంటూ హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మిత్రపక్షం భాజపాను ఒప్పించి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపించాలని సూచించారు. ‘‘ఎంపీపీ ఎన్నికల్లో జనసేన, తెదేపా ఒక్కటయ్యాయి. వైకాపా గెలవొద్దని ఆ రెండు పార్టీలు జట్టుకట్టాయి. ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌పై వైకాపా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భారత్‌ బంద్‌కు మద్దతుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని