Ts News: ఎంపీ మాలోత్‌ కవితకు 6నెలల జైలు శిక్ష

తాజా వార్తలు

Updated : 25/07/2021 05:05 IST

Ts News: ఎంపీ మాలోత్‌ కవితకు 6నెలల జైలు శిక్ష

హైదరాబాద్‌: మహబూబాబాద్‌ తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీసస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. అనంతరం ఆమెకు ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని