AP News: ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 21/10/2021 10:41 IST

AP News: ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్న

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందని ఆవేదనతో పోరాడుతుంటే దాడికి దిగుతున్నారని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులు అర్పిస్తూ.. ప్రాణత్యాగం చేసిన పోలీసులు ఆత్మలు డీజీపీ తీరుతో ఘోషిస్తున్నాయని తెలిపారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి, రాష్ట్రంలోని ఆ పార్టీ కార్యాలయాలపై వైకాపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ తెదేపా అధినేత చేపట్టిన 36 గంటల నిరసన దీక్షలో అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు.

‘‘రెండున్నరేళ్లలో పోలీస్‌ వ్యవస్థను డీజీపీ భ్రష్టుపట్టించారు. జగన్‌, వైకాపా నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా?ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. సీఎం, డీజీపీ కలిసి కుట్రపన్ని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారు. నివాసం తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. తెదేపా నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమిది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలం. అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం. సమాజ చైతన్యం కోసమే 36గంటల దీక్ష’’ అని అచ్చెన్న చెప్పారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని