జగన్‌వి అనాలోచిత నిర్ణయాలు: చినరాజప్ప

తాజా వార్తలు

Updated : 21/07/2021 11:47 IST

జగన్‌వి అనాలోచిత నిర్ణయాలు: చినరాజప్ప

అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్‌వి అనాలోచిత నిర్ణయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. దీని వల్ల అధికారులు బలవుతున్నారని చెప్పారు.‘‘పోలవరం సహాయ, పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయకుండానే గిరిజనులను బలవంతంగా తరలిస్తున్న ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసింది. 18 గ్రామాలకు చెందిన 1,724 నిర్వాసిత గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా రాజకీయ ఒత్తిళ్లతో వారిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం సహాయ, పునరావాసం చేపట్టాల్సి ఉండగా ఆ వివరాలేవీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్రానికి తెలియనివ్వట్లేదు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల జూన్ నుంచే ముంపు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు" అని చినరాజప్ప ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని