ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు: కాలవ

తాజా వార్తలు

Updated : 15/07/2021 20:19 IST

ఇద్దరు సీఎంలు కుమ్మక్కయ్యారు: కాలవ

మంగళగిరి: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఇద్దరు సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో కాలవ మీడియాతో మాట్లాడారు. జలవివాదంపై అనవసర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించడం లేదనటం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి సీఎం జగనా? లేక చంద్రబాబా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదు? జలవివాదాలపై సీఎం జగన్‌ ఎందుకు స్పందించడం లేదు? లేఖలు రాస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా?అని ప్రశ్నించారు. జలవివాదంపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని