AP News: కొండపల్లిలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్సే: పట్టాభి

తాజా వార్తలు

Updated : 01/08/2021 13:33 IST

AP News: కొండపల్లిలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్సే: పట్టాభి

అమరావతి: కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. తండ్రి బీజం వేస్తే కుమారుడు అధికారంలోకి వచ్చాక దాన్ని పెంచి పెద్దది చేశారని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. 

‘‘వైఎస్‌ఆర్‌ హయాంలో రెవెన్యూ రికార్డులను టాంపర్‌ చేసి లేని సర్వే నంబర్‌ 143ను సృష్టించారు. ఆ సర్వే నంబర్‌ కింద అక్రమ మైనింగ్‌ కోసం 216.25 ఎకరాలు కేటాయించారు. సర్వే నంబర్‌ 143 ఇంకు పెన్నుతో రాసి సృష్టించిందేనని డిసెంబర్‌ 27, 2016న ఇచ్చిన తీర్పులో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తెదేపా ప్రభుత్వంలో హైకోర్టు తీర్పునకు లోబడి 2017లో అప్పటి సీఎం చంద్రబాబు మైనింగ్‌ లీజులన్నీ రద్దు చేశారు. అప్పటి రెవెన్యూ మంత్రిగా కేఈ కృష్ణమూర్తి ఉన్న సమయంలో సదరు సర్వే నంబర్లలోని భూములను రెవెన్యూ భూములుగా పరిగణించినట్లు వైకాపా ఆరోపిస్తోంది. కానీ దస్త్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామనే నాడు కేఈ కృష్ణమూర్తి చెప్పారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే. జగన్‌, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ డైరెక్షన్‌లోనే అక్టోబర్‌ 17, 2019న అధికారులు అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారు’’ అని పట్టాభి ఆరోపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని