AP News: ఏపీలో ఫ్యాక్షన్‌ మూకలు రెచ్చిపోతున్నాయి: లోకేశ్‌ 

తాజా వార్తలు

Published : 21/09/2021 13:31 IST

AP News: ఏపీలో ఫ్యాక్షన్‌ మూకలు రెచ్చిపోతున్నాయి: లోకేశ్‌ 

అమరావతి: ఏపీలో ఫ్యాక్షన్‌ మూకలు రెచ్చిపోతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా నాయకురాలు ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. విచక్షణా రహితంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్శ ఇచ్చిన వివరణ పట్ల తెదేపా సీనియర్‌ నేతలు స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి జరగలేదనేలా చిత్రీకరణకు యత్నం జరుగుతోందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. పోలీస్‌, ఐపీఎస్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా పని చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ కార్యాలయం వద్ద విధులకు ఆటంకం కలిగించామని కేసు పెట్టారని ఆక్షేపించారు.

‘‘గుంటూరు డీఐజీ త్రివిక్రమ వర్మ సినిమా కథను బాగా అల్లారు. చంద్రబాబుతో జోగి రమేశ్‌ మాట్లాడేందుకు వచ్చారని ఎలా చెబుతారు? చంద్రబాబుతో మాట్లాడటానికి జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటి?జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న ప్రతిపక్ష నేతను అపాయింట్‌మెంట్ లేకుండా కలుస్తారా?డీఐపీ స్థాయి వ్యక్తి పోలీస్ వ్యవ్యస్థను కించపరిచేలా మాట్లాడారు’’ అని తెదేపా సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న  అన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని