AP News: దేవినేని ఉమ అరెస్టుపై నిరసన.. తెదేపా నేతల గృహనిర్బంధం

తాజా వార్తలు

Updated : 28/07/2021 11:47 IST

AP News: దేవినేని ఉమ అరెస్టుపై నిరసన.. తెదేపా నేతల గృహనిర్బంధం

అమరావతి: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. మచిలీపట్నంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను, నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా జిల్లాలో ఆందోళనలకు తెదేపా పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నేతలను బయటకు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. 

పార్టీ శ్రేణుల ఆందోళన..
దేవినేని ఉమ అక్రమ అరెస్టును ఖండిస్తూ కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌స్టేషన్‌ వద్ద తెదేపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఉమను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. అన్యాయాన్ని ప్రశ్నించిన నేత అరెస్టు దుర్మార్గమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమను తమకు చూపించాలని నినాదాలు చేశారు. దీంతో నందివాడ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని