ఇప్పుడేమీ మాట్లాడను: తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

తాజా వార్తలు

Updated : 27/08/2021 21:16 IST

ఇప్పుడేమీ మాట్లాడను: తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం: తెదేపాకు రాజీనామా చేయనున్నారంటూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరిగా స్పందించలేదు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు గురువారం ఆయన నివాసం వద్ద ప్రశ్నించగా దానిపై ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు. అనుబంధ కమిటీలు, స్థానిక నాయకత్వంపై గత కొద్దిరోజులుగా బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇప్పుడేమీ మాట్లాడనని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

బుచ్చయ్య చౌదరికి చంద్రబాబు ఫోన్‌

తాజా పరిణామాల నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. అసంతృప్తి విషయంపై ఆయనతో మాట్లాడారు. స్థానికంగా ఇబ్బందులుంటే తనకు చెప్పాలని సూచించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని