ఖాకీ డ్రెస్‌లో సేవ చేయాల్సింది ప్రజలకి.. పార్టీలకు కాదు: రామ్మోహన్‌ నాయుడు

తాజా వార్తలు

Updated : 25/09/2021 15:57 IST

ఖాకీ డ్రెస్‌లో సేవ చేయాల్సింది ప్రజలకి.. పార్టీలకు కాదు: రామ్మోహన్‌ నాయుడు

అమరావతి: ఏపీలో డ్రగ్స్‌ మాఫియా నడుస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో డీజీపీ తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం అంశంపై అయినా తెదేపా సాక్ష్యాధారాలతో మాట్లాడుతుందని.. ఈ విషయాన్ని డీజీపీ గుర్తుంచుకోవాలన్నారు.

డ్రగ్స్‌ విషయంలో డీజీపీ, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తే ప్రతిపక్షానికి పోలీసు వ్యవస్థపై నమ్మకం ఎలా కలుగుతుందని ప్రశ్నించారు. ఖాకీ డ్రెస్‌ వేసుకుని ప్రజలకు సేవ చేయాలి కానీ పార్టీలకు కాదని రామ్మోహన్‌ మండిపడ్డారు. హెరాయిన్‌ అంశంలో వే బిల్లులు బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని