AP News: అవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లా?: అయ్యన్నపాత్రుడు

తాజా వార్తలు

Updated : 05/10/2021 20:19 IST

AP News: అవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లా?: అయ్యన్నపాత్రుడు

విశాఖ: ఏపీలో సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం, వ్యవసాయ మంత్రి విఫలయ్యారు. ప్రభుత్వ లెక్కలు, వాస్తవాలకు పొంతన లేకుండా ఉంది. రాయలసీమలో ఉల్లి, టమాటా, ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దారుణంగా పడిపోయింది. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఇవన్నీ చాలవన్నట్లు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని