AP News: కొప్పర్రు దాడి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ధూళిపాళ్ల

తాజా వార్తలు

Updated : 21/09/2021 15:26 IST

AP News: కొప్పర్రు దాడి బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ధూళిపాళ్ల

పెదనందిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో తెదేపా నాయకురాలు శారదా ఇంటిపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో తెదేపా నేతల బృందం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ‘‘కొప్పర్రులో పోలీసులు వైఫలం కన్పిస్తోంది. ఈ దాడి ఘటనకు పోలీసులదే బాధ్యత. దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదు. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. స్థానిక వైకాపా నేతలకు పోలీసులు వత్తాసు పలికారు. భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాడి ఘటన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ధూళిపాళ్ల హెచ్చరించారు. నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని