Vijayanagaram: వైకాపాలో వర్గపోరు.. వేపాడు ఎంపీపీ ఎన్నిక రసాభాస

తాజా వార్తలు

Updated : 24/09/2021 18:57 IST

Vijayanagaram: వైకాపాలో వర్గపోరు.. వేపాడు ఎంపీపీ ఎన్నిక రసాభాస

వేపాడు: విజయనగరం జిల్లా వేపాడులో వైకాపా వర్గపోరుతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ఎన్నిక నిర్వహిస్తున్న సమావేశ మందిరంలోకి చొరబడిన వైకాపా తిరుగుబాటు వర్గం నాయకులు రిటర్నింగ్‌ అధికారి నుంచి పత్రాలు లాక్కుని చించేశారు.  పోలీసులు అడ్డుకున్నా తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లిన తిరుగుబాటు వర్గం వారు పత్రాలు లాక్కుని అక్కడి బల్లలు లాగి పడేశారు. ఈచర్యతో సమావేశమందిరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తరువాత ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. వేపాడులో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థిని తిరుగుబాటు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక్కడ మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు 12 చోట్ల వైకాపా గెలిచింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని