TS News: నిరసన చేపట్టి తీరుతాం: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 16/07/2021 11:40 IST

TS News: నిరసన చేపట్టి తీరుతాం: రేవంత్‌

హైదరాబాద్‌: తమ సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడం, పలువురు నేతలను ముందస్తుగా నిర్బంధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ పిలుపు మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామన్నారు. ధర్నా చౌక్‌ నుంచి రాజ్‌భవన్‌కు ప్రదర్శనగా వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని.. పీసీసీ అధ్యక్షుడిగా తాను హామీ ఇస్తున్నట్లు చెప్పారు.

‘‘ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు చేస్తే చూస్తూ ఊరుకోం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. గృహ నిర్బంధం చేసిన వారిని వదిలిపెట్టాలి. రూ.40 పెట్రోల్‌ను రూ.105లకు విక్రయిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ఈ దేశ పౌరులుగా మాకు హక్కు లేదా? పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారు. పోలీసులు తమ విచక్షణాధికారాల మేరకు విధులు నిర్వహించాలి. ఎంతమందిని అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతాం’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని