ts politics: లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 25/07/2021 19:06 IST

ts politics: లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డి కలిశారు.  అనంతరం చిరాన్‌ పోర్ట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సురేఖతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ...తనకు, ప్రేమ్‌సాగర్‌రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.  ప్రేమ్‌ సాగర్‌రావు సోదర సమానులన్న రేవంత్‌రెడ్డి.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్‌పార్టీ బలోపేతం కోసం కదంతొక్కనున్నట్టు ప్రకటించారు. 

బంధుత్వానికి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ జెండా దించకుండా మోసిన వారే తన బంధువులని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, ఏపీలో పార్టీని చంపుకొని ఇచ్చారన్నారు. కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ధనిక రాష్ట్రంగా కేసీఆర్‌ చేతిలో పెడితే దివాళా తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ఉప ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తున్నాయని, ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారని విమర్శించారు. రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 1.35 కోట్ల మంది దళిత, గిరిజనులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితులను మోసం చేసి ఓట్లు డబ్బాలో వేసుకుంటాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17వరకు దళిత గిరిజన దండోరా మోగిస్తామని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని