Talasani: తెరాస తిరుగులేని శక్తిగా మారింది: తలసాని

తాజా వార్తలు

Updated : 02/09/2021 15:05 IST

Talasani: తెరాస తిరుగులేని శక్తిగా మారింది: తలసాని

వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండా 

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెరాస జెండా రెపరెపలాడుతోంది. జెండా పండుగలో భాగంగా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నేతలు పార్టీ కార్యాలయాల వద్ద గులాబీ జెండాలు ఎగురవేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస జెండా పండుగ నిర్వహిస్తోంది. తెలంగాణ భవన్‌లో వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ మహమద్‌ సలీం గులాబీ జెండాను ఎగురవేశారు.

సికింద్రాబాద్‌ బంసిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్ద  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాస జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ గులాబీ జెండా ఎగురవేశారు. ఈ జెండా పండగ పూర్తి కాగానే.. గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం మొదలు కానుంది. ఈ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 51శాతం ఉండాలని సీఎం దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇవాళ దేశ రాజధాని దిల్లీలో తెరాస భవనానికి కేసీఆర్‌ భూమిపూజ చేయనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని