Huzurabad By Election: హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి ఖరారు

తాజా వార్తలు

Updated : 11/08/2021 13:39 IST

Huzurabad By Election: హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి ఖరారు

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు తెరాస అభ్యర్థిని ఆ పార్టీ ఖరారు చేసింది. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. శ్రీనివాస్‌ యాదవ్‌ స్వస్థలం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్‌ శాసనసభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. 

శ్రీనివాస్‌ను గెలిపించండి: తలసాని

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను సీఎం కేసీఆర్‌ ఖరారు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించాలని హుజూరాబాద్‌ ప్రజల్ని తలసాని కోరారు. భాజపా గెలిస్తే వారికొక శాసనసభ్యుడు మాత్రమే పెరుగుతారని దాని వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ గెలిస్తే సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో హుజూరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయన్నారు.


 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని