TS Politics: రేవంత్‌.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకో: తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 26/08/2021 14:27 IST

TS Politics: రేవంత్‌.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకో: తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: అధికారంలోకి రాలేమని గ్రహించే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. తెరాస శాసన సభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డిది మాటలు.. మూటలు.. ముఠాలు చేసే వైఖరని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌పై ఆయన ప్రయోగిస్తున్న పరుష పదజాలంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీలకు లేఖలు రాసినట్లు చెప్పారు. 

ఈ లేఖల తర్వాతైనా రేవంత్‌ పద్ధతి మార్చుకోవాలని.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తే ఆధారాలతో బయటపెట్టాలన్నారు. సొంత పార్టీలో ఎవరూ లెక్క చేయడం లేదనే ఆక్రోశంతో రేవంత్‌ అలా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రగతిభవన్‌ నుంచే పాలన చేశారని.. అప్పుడెందుకు బహుజన పేరు పెట్టలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో బహుజన బోర్డులు పెట్టి తెలంగాణలో మాట్లాడాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని