KTR: బాబు బినామీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా?

తాజా వార్తలు

Published : 28/08/2021 02:17 IST

KTR: బాబు బినామీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా?

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి తెరాస జెండా పండగ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెల్లడించారు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకూ గ్రామ, వార్డు కమిటీల నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌ నెలాఖరుకు అన్ని కార్యవర్గాల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో 1,400 బస్తీల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పార్టీ కమిటీల్లో 51 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని.. హైదరాబాద్‌ కోసం రెండు, మూడు రోజుల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, కమిటీలు దృఢంగా ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. పార్టీ అనుబంధ సంఘాలను కూడా మరింత పటిష్టం చేస్తామన్నారు. కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్‌ 2న దిల్లీలో తెరాస భవనానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు. తెలంగాణ భవన్‌ కంటే ఉన్నతంగా దిల్లీలో భవన్‌ను నిర్మిస్తామన్నారు.

‘‘రాజకీయాల్లో ఉన్నవారు సంస్కారవంతంగా మాట్లాడాలి. చంద్రబాబు తొత్తు, బినామీని కాంగ్రెస్ దిగుమతి చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించాలా? మహారాష్ట్ర సీఎంపై వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిని లోపలేశారు. మల్లారెడ్డికి జోష్‌ ఎక్కువ.. ఒక మాట అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు’’ అని ప్రతిపక్ష నేతలపై కేటీఆర్‌ విమర్శనాస్త్రాలు సంధించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని