ఏపీ వైఖరే కారణం: జగదీశ్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 15/07/2021 19:20 IST

ఏపీ వైఖరే కారణం: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాక్యలు చేశారు. నీటి పంచాయితీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఖరే కారణమని పునరుద్ఘాటించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్నేహ హస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదన్నారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేదని, నీటి వాటా తేల్చాలని తాము కూడా సుప్రీంకోర్టును అడుగుతున్నామని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని జగదీశ్‌రెడ్డి తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని