చేనేత కార్మికులకు రాజకీయ ప్రాతినిధ్యం: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 16/07/2021 17:45 IST

చేనేత కార్మికులకు రాజకీయ ప్రాతినిధ్యం: కేసీఆర్‌

హైదరాబాద్‌: ఇటీవల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెరాస సభ్యత్వం తీసుకున్న ఎల్‌.రమణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెరాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌ మాట్లాడుతూ... ఎల్‌ రమణ తెరాసలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు రమణ పార్టీలో చేరారని సీఎం అన్నారు. నిబద్ధత గల వ్యక్తి పార్టీలో చేరడం ఎంతో సంతోషమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎల్‌ రమణ రూపంలో ఒక మంచి రాజకీయ నాయకుడిని ప్రజలు చూస్తారని అభిప్రాయపడ్డారు.

‘‘చేనేత వర్గంలో నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉంది. ఈ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రస్తుతం తెరాసలో నేతలెవరూ లేరు. పెద్ద జనాభా, సమస్యలు ఉన్నటువంటి వర్గం. రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేదని ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేశాం. చేనేత సామాజిక వర్గం అనుభవిస్తున్న బాధలు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపడుతోంది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. మరణించిన చేనేత కార్మికులకు బీమా సౌకర్యం, వాళ్లకు కూడా రైతు బీమా లాంటి పథకాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సాధ్యమైనంత తొందర్లో అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. చేనేత సామాజిక వర్గానికి చేయాల్సిన సేవలను ఎల్‌ రమణ ద్వారా అందించేందుకు కృషి చేస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని