Kishan reddy: తితిదే బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదు: కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 18/09/2021 18:42 IST

Kishan reddy: తితిదే బోర్డులో సభ్యత్వం కోసం ఎవరినీ సిఫారసు చేయలేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తితిదే జంబో బోర్డు ఏర్పాటుపై మొదలైన రాజకీయ దుమారం కొత్త మలుపు తిరిగింది. ఈవిషయంపై ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తితిదే బోర్డులో సభ్యత్వం కోసం తాను ఎవరినీ సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. తితిదే ప్రత్యేక ఆహ్వానితులు వై.రవిప్రసాద్‌ పేరును తాను సిఫారసు చేయలేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా కానీ, పర్యాటకశాఖ తరఫున గానీ... ఎవరినీ సూచించలేదని లేఖలో పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా రాజకీయ, వ్యాపార ప్రయోజనాలతో 81 మందితో తితిదే జంబో బోర్డు ఏర్పాటు చేశారని ఇప్పటికే తెదేపా ఆరోపిస్తోంది. తాజాగా కిషన్‌రెడ్డి లేఖతో కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది.

జంబో బోర్డుపై విచారణ జరిపించాలి: భానుప్రకాశ్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తమ సొంతం అన్నట్టుగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని భాజపా నేత భానుప్రకాశ్‌ విమర్శించారు. తితిదేలో  ప్రత్యేక ఆహ్వానితులను ఏ ప్రాతిపదికన నియమించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  సభ్యుల పూర్వాపరాలు విచారించకుండా నియామకాలా అని ప్రశ్నించారు. కేవలం దర్శనం కోసమే ప్రత్యేక ఆహ్వానితులను నియమించారా అని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి ప్రత్యేక ఆహ్వానితులు అందరినీ రద్దు చేసి, జంబో బోర్డుపై విచారణ జరిపించాలని భానుప్రకాశ్‌ డిమాండ్‌ చేశారు. 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని