AP News: చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌

తాజా వార్తలు

Updated : 21/09/2021 12:32 IST

AP News: చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌

రాజమహేంద్రవరం: తనపై సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై వైకాపా ఎంపీ భరత్‌ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు.‘‘ మా కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. వి.వి.లక్ష్మీనారాయణతో నేను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించారు. నాపై అభియోగాలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. కాపు సమావేశంలో లక్ష్మీనారాయణను కలిశాను. నేను పార్లమెంట్‌లో చాలా బాగా మాట్లాడానని లక్ష్మీనారాయణ అన్నారు. నేను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదు.. వీడియో దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది’’ అని భరత్‌ అన్నారు.

తమ పార్టీలోని ఒక నాయకుడు తెదేపా నాయకులతో కుమ్మక్కై తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిన్న ఆరోపణలు చేశారు. ‘‘పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే.. వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీకి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్‌ను ఉద్దేశించి జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని