సీఎం చూసుకోమన్నందుకే ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి: విజయసాయిరెడ్డి

తాజా వార్తలు

Updated : 02/09/2021 12:38 IST

సీఎం చూసుకోమన్నందుకే ఉత్తరాంధ్ర జిల్లాలపై దృష్టి: విజయసాయిరెడ్డి

విశాఖ: డబ్బు, భూముల కొనుగోలు, భూ ఆక్రమణలపై తనకు ఆసక్తి లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నానని ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్భంగా విశాఖలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం చూసుకోమన్నందునే దృష్టిపెట్టా. నా పేరున ఇప్పటి వరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు. భవిష్యత్తులో విశాఖలో స్థిరపడాలనుకుంటున్నా.

నా పేరు చెప్పి భూ ఆక్రమణలకు పాల్పడితే టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి. త్వరలో రెండు టోల్‌ఫ్రీ నెంబర్లు ఇస్తా.. ఫోన్‌ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. అధికారంలో ఉన్నాం.. ఎవరు ప్రశ్నించరనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజాభీష్టం మేరకు పాలన చేయాలని మేయర్‌, కార్పొరేటర్‌కు చెబుతున్నా’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని