అమరావతిలో మరోసారి ఉద్రిక్తత
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 16:21 IST

అమరావతిలో మరోసారి ఉద్రిక్తత

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా శ్రేణుల దాడిలో గాయపడిన ఉంగుటూరు మాజీ సర్పంచిని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ బుధవారం గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో తెదేపా నేతల వాహనాలను వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. కొమ్మాలపాటి కారుకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీగా మోహరించిన పోలీసులు వైకాపా శ్రేణులను అదుపు చేయడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం కొమ్మాలపాటి శ్రీధర్‌ తన కారులో వెళ్లి ఉంగుటూరు మాజీ సర్పంచిని పరామర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని