థాంక్యూ గుజరాత్‌.. మోదీ ట్వీట్‌ 

తాజా వార్తలు

Published : 24/02/2021 01:38 IST

థాంక్యూ గుజరాత్‌.. మోదీ ట్వీట్‌ 

దిల్లీ: తమ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపాకు దక్కిన భారీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆనందం వ్యక్తంచేశారు. భాజపాకు మరోసారి ప్రజలు అందించిన అపూర్వ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా అనుకూల విధానాలే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఫలితాలు అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. భాజపా పట్ల మరోసారి నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తనూ ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజరాత్‌ ప్రజలకు సేవచేయడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తానన్నారు.

గుజరాత్‌లో భాజపాకు దక్కిన అఖండ విజయం తమ పార్టీ పట్ల  ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అని అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు ఆయన గుజరాతీలో ట్వీట్‌ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపాకు విజయం అందించిన అభినందనలు తెలిపారు. గుజరాత్‌లో మొత్తం ఆరు కార్పొరేషన్లనూ భాజపా గెలుచుకుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తమ పార్టీకి అద్వితీయమైన విజయం అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని