అలాగైతే శవాలు ఎందుకు కొట్టుకొచ్చాయ్‌?: దీదీ

తాజా వార్తలు

Published : 16/07/2021 01:42 IST

అలాగైతే శవాలు ఎందుకు కొట్టుకొచ్చాయ్‌?: దీదీ

కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరూ విమర్శనాస్త్రాలు సంధించుకోగా.. తాజాగా యూపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించడంపై దీదీ మండిపడ్డారు. కరోనా వైరస్‌ను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అద్భుతంగా కట్టడి చేయగలిగిందంటూ ప్రధాని కితాబివ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. అంత అద్భుతంగా కట్టడి చేసినట్లయితే..గంగా నదిలో మృతదేహాలు ఎద్దుకు కొట్టుకొచ్చాయని ప్రశ్నించారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో గురువారం పర్యటించిన సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని అభినందించారు.కొవిడ్‌ రెండోదశ వ్యాప్తిని అరికట్టడంలో యూపీ ప్రభుత్వం సఫలీకృతమైందని కొనియాడారు.

‘‘ కేవలం భాజపా పాలిత రాష్ట్రమైనందువల్లే ప్రధాని మోదీ యూపీ ప్రభుత్వానికి సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కూడా కొవిడ్‌ కట్టడికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. అందుకే గంగానదిలో నదిలో శవాలు తేలినట్లుగా ఇక్కడ తేలలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైంది’’ అని దీదీ విమర్శించారు. యూపీ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించడంపై తృణమూల్‌ రాజ్యసభ ఎంపీ ఓబ్రియాన్‌ కూడా స్పందించారు. ‘‘ ఆయన జులై 15ని ఏప్రిల్‌ 1గా ఫీలయినట్లున్నారు’’అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని