Raghurama: ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ పార్ల‌మెంట్‌కు అవ‌మానం

తాజా వార్తలు

Updated : 06/06/2021 13:57 IST

Raghurama: ఎంపీపై థ‌ర్డ్ డిగ్రీ పార్ల‌మెంట్‌కు అవ‌మానం

ఏపీ సీఐడీ తీరును ఖండించిన కేర‌ళ ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్‌

అమ‌రావ‌తి: ఏపీ సీఐడీ క‌స్ట‌డీలో త‌న‌ను కొట్టారంటూ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు రాసిన లేఖ‌పై కేర‌ళ ఎంపీ ప్రేమ్‌చంద్ర‌న్ స్పందించారు. ర‌ఘురామ‌పై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించ‌డం దారుణ‌మన్నారు. ఏపీ సీఐడీ తీరును ఆయ‌న ఖండించారు. ఎంపీగా ఉన్న ర‌ఘురామ‌ను కొట్ట‌డ‌మంటే పార్ల‌మెంట్‌ను అవ‌మానించ‌డ‌మే అని అన్నారు. ఈ అంశాన్ని పార్ల‌మెంట్‌లో త‌ప్ప‌కుండా లేవ‌నెత్తుతాన‌ని ప్రేమ్ చంద్ర‌న్ చెప్పారు. 

ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగేలా వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌త నెల ఎంపీ రఘురామ కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లారు. అక్క‌డ పోలీస్ కస్ట‌డీలో ఉంచి విచారించారు. ఎంపీ హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. మంజూరు కాక‌పోవ‌డంతో సుప్రీంను ఆశ్ర‌యించారు. అక్క‌డ ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరైంది. అంత‌క‌ముందు..  క‌స్ట‌డీలో ఉండ‌గా త‌నను పోలీసులు కొట్టార‌ని ఎంపీ గుంటూరు జిల్లా న్యాయ‌మూర్తికి వివ‌రించ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు సైతం చేసి వైద్య బృందం నివేదిక కోర్టుకు అంద‌జేసిన విష‌యం తెలిసిందే. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని