అక్కడ థర్డ్‌ఫ్రంట్‌ సక్సెస్‌ కాలేదు: నారాయణ 

తాజా వార్తలు

Published : 28/02/2021 00:59 IST

అక్కడ థర్డ్‌ఫ్రంట్‌ సక్సెస్‌ కాలేదు: నారాయణ 

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే స్పష్టమైన పోటీ ఉంటుందని, ఈ అక్కడ తృతీయ కూటమి విజయవంతం కాలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ తమిళనాడులో మూడో కూటమి ఏర్పాటు దిశగా చేస్తోన్న ఆలోచనపై ఆయన స్పందించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. తమిళనాడులో రెండు బలమైన పార్టీలు పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు  తృతీయ కూటమి వైపు ఆకర్షితులుకారన్నారు. అందువల్ల తృతీయ కూటమికి విజయావకాశాలు కష్టమేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకే కూటమే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు డీఎంకే కూటమితో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి కొన్ని గంటల ముందే తమిళనాడులోని వన్నియర్లకు సీఎం పళనిస్వామి రిజర్వేషన్లు ప్రకటించడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఎలాంటి చర్చ చేపట్టకుండా ఒక కులానికి రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించడం కూడా బాధ్యతారాహిత్యం, అవకాశవాదమని మండిపడ్డారు. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని నారాయణస్వామి ప్రభుత్వాన్ని అనైతిక పద్ధతిలో కేంద్రం పడగొట్టిందని, అక్కడ మళ్లీ కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

జగన్‌.. లేఖలు రాస్తే సరిపోదు!

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లేఖలు రాస్తే సరిపోదని నారాయణ అన్నారు. విజ్ఞాపనలతో పనికాదని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం జగన్‌ పోరాడాల్సిందేనన్నారు. కేంద్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని