లక్షన్నర ఓట్లు దాటిన గురుమూర్తి ఆధిక్యం
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 14:09 IST

లక్షన్నర ఓట్లు దాటిన గురుమూర్తి ఆధిక్యం

తిరుపతి: వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. 11 రౌండ్లు ముగిసే సరికి గురుమూర్తి 1,58,401 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పదో రౌండ్‌ ముగిసే సరికి వైకాపాకు 3,62,315, తెదేపాకు 2,03,914 భాజపాకు 35,554, కాంగ్రెస్‌కు 5,905 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు, తిరుపతిలోని రెండు కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇంకా 14 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. కౌంటింగ్‌ ప్రక్రియను నలుగురు పరిశీలకులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు కొనసాగుతోంది.

సాగర్‌, తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని