close

తాజా వార్తలు

Published : 08/03/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక పార్టీ టికెట్‌ తీసుకొని..ఇంకో పార్టీలోకి!

 

కోల్‌కతా: నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమ్‌ బెంగాల్‌లో భాజపా, అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఒకవైపు విమర్శల పర్వం..మరోవైపు నుంచి టీఎంసీ నుంచి భాజపాలోకి వెళ్తోన్న వలసలు కొనసాగుతున్నాయి. చివరికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వచ్చాక కూడా టీఎంసీ అభ్యర్థి ఒకరు పార్టీ మారనుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం ఆశావహులు ఎదురుచూస్తుంటారు. కానీ, పశ్చిమ్‌ బెంగాల్‌లోని హబీబ్‌పుర్‌ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు సరళ ముర్ము అనే అభ్యర్థికి టీఎంసీ టికెట్ ఇచ్చినప్పటికీ..ఆమె సోమవారం భాజపాలో చేరనున్నారు. మార్చి 5న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీఎంసీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అందులో సరళ పేరు కూడా ఉంది. ఆమె గతంలో మాల్డా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. 

 తాజా పరిణామంపై టీఎంసీ స్పందించింది. హబీబ్‌పుర్ నియోజక వర్గానికి ప్రదీప్‌ బాస్కీని కొత్త అభ్యర్థిగా ప్రకటించింది. అనారోగ్య కారణాలతో అభ్యర్థిని మార్చినట్లు టీఎంసీ తన ప్రకటనలో చెప్పుకోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని