రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ

తాజా వార్తలు

Published : 09/10/2020 13:44 IST

రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం సవరణల ముసాయిదా బిల్లులను కేబినెట్‌ ఆమోదించే అవకాశముంది. వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో పంటలసాగుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, 14న ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. చట్ట సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించి ఆమోదించే అవకాశముంది.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని