50 వేల పోస్టులే భర్తీ చేస్తారా?: రేవంత్‌

తాజా వార్తలు

Updated : 10/07/2021 18:48 IST

50 వేల పోస్టులే భర్తీ చేస్తారా?: రేవంత్‌

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిశ్వాల్‌ కమిటీ చెప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా?అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘‘కరోనా వేళ స్టాఫ్‌ నర్సులను దేవుళ్లని పొగిడారు. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్‌ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నఫళంగా 1,640 కుటుంబాలను కేసీఆర్‌ రోడ్డున పడేశారు. 2018లో ఎంపికైన ఏఎన్‌ఎంలకు ఇప్పటికీ పోస్టులు లేవు. స్టాఫ్‌ నర్సులను విధుల్లో కొనసాగించాలి. 2018 ఏఎన్‌ఎం అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలివ్వాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తమను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించిన నర్సులకు వారి తరఫున పోరాటం చేస్తామని ఆయన భరోసా కల్పించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని