డబ్బులు పంచుతున్నా పట్టించుకోవట్లేదు: రాజాసింగ్

తాజా వార్తలు

Published : 30/11/2020 11:52 IST

డబ్బులు పంచుతున్నా పట్టించుకోవట్లేదు: రాజాసింగ్

హైదరాబాద్: ఓట్ల కోసం గత రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. బహిరంగంగా పంచుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, పైగా వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలపై లాఠీ చేస్తున్నారని చెబుతూ... మైలార్‌దేవ్‌పల్లితోపాటు పలు డివిజన్‌లలో ఇలాంటి దాడులు జరిగాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తెరాసకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈ భావిస్తోందని రాజాసింగ్‌ ఆరోపించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని