రామగుండంలో తెరాస ఎంపీ, ఎమ్మెల్యే ధర్నా

తాజా వార్తలు

Published : 12/09/2020 13:22 IST

రామగుండంలో తెరాస ఎంపీ, ఎమ్మెల్యే ధర్నా

గోదావరిఖని పట్టణం: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం పనులను పరిశీలించేందుకు  కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మాన్‌ సుఖ్‌ లక్ష్మణ్‌భాయి శనివారం మధ్యాహ్నం రామగుండం విచ్చేశారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, రామగుండం ఎమ్మెల్యే చందర్‌తోపాటు తెరాస కార్యకర్తలు ఎరువుల కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు. స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలను అమ్మకుంటున్నారని ఆరోపించారు. వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంత్రులు నిరసనకారుల వద్దకు వెళ్లగానే ఆందోళన మరింతగా పెరిగింది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కేంద్రమంత్రులు ఎరువుల కర్మాగారం పరిశీలనకు వెళ్లారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని