జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలు తెరాసవే
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 13:08 IST

జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలు తెరాసవే

 

జడ్చర్ల‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీని అధికార పార్టీ తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ ఇప్పటి వరకు 19 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. వీటిలో 16 వార్డుల్లో తెరాస గెలుపొందింది. ఇక్కడ మొత్తం 27 వార్డులుండగా.. అధిక స్థానాల్లో తెరాస గెలిచి మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 12 వార్డుల్లో 7 చోట్ల గులాబీ పార్టీ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్‌ 5 వార్డులకే పరిమితమైంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని