‘‘డబ్బు, మద్యంతో తెరాస గెలవాలనుకుంటోంది’’
close

తాజా వార్తలు

Updated : 15/04/2021 14:57 IST

‘‘డబ్బు, మద్యంతో తెరాస గెలవాలనుకుంటోంది’’

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఠాగూర్‌

హైదరాబాద్‌: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో అధికార పార్టీ డబ్బు, మద్యంతో గెలవాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. సాగర్‌ ఎన్నికలో కాంగ్రెస్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల జరిగితే తాము భారీ మెజార్టీతో గెలుస్తామనే సంకేతాలున్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన జరుగుతోందని ఆయన విమర్శించారు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని