Liquor Ban: మద్యం నిషేధించకపోతే ఉద్యమిస్తా.. మధ్యప్రదేశ్‌ సర్కార్‌కు ఉమాభారతి హెచ్చరిక!

తాజా వార్తలు

Published : 19/09/2021 01:27 IST

Liquor Ban: మద్యం నిషేధించకపోతే ఉద్యమిస్తా.. మధ్యప్రదేశ్‌ సర్కార్‌కు ఉమాభారతి హెచ్చరిక!

భోపాల్‌: రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి మరోసారి గళం విప్పారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సర్కార్‌ మద్యపానాన్ని నిషేధించకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడతానంటూ హెచ్చరించారు. ఇందుకోసం వచ్చే ఏడాది జనవరి 15 వరకు ప్రభుత్వానికి ఆమె గడువు విధించారు. మద్యానికి వ్యతిరేకంగా ఐదు నెలల పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ మద్యానికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జనవరి 15 తర్వాత తాను ఆందోళనకు దిగుతానని ప్రకటించారు.

క్యాంపెయిన్‌ ద్వారా మద్య మద్యపానాన్ని నివారించవచ్చని శర్మ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్ చెబుతున్నారని.. కానీ దాంతో సాధించలేమని తాను విశ్వసిస్తున్నట్టు గతంలో సీఎంగా పనిచేసిన ఉమాభారతి పేర్కొన్నారు. బలవంతంగా చర్యలు తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. లిక్కర్‌ అమ్మకాలను నిలిపివేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు నష్టం వస్తుందని, అయితే, దాన్ని పూడ్చే ఉపాయం తన వద్ద ఉందని చెప్పారు. ఇది వాళ్లతో పంచుకుంటానన్న ఉమా భారతి.. నిషేధించాలన్న అంశంపై మాత్రం వెనకడుగువేసిది లేదన్నారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉమాభారతి మద్యం నిషేధంపై క్యాంపెయిన్‌ నిర్వహిస్తానని ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యాన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఉమాభారతి విజ్ఞప్తి చేస్తూ గతంలో వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని