యోగి ప్రభుత్వంపై సొంత పార్టీ నేత విమర్శలు

తాజా వార్తలు

Published : 28/06/2021 01:10 IST

యోగి ప్రభుత్వంపై సొంత పార్టీ నేత విమర్శలు

బాలియా (యూపీ): ఉత్తర్‌ప్రదేశ్‌లో కొవిడ్‌ కట్టడి విషయంలో యోగి ప్రభుత్వంపై సొంత పార్టీ నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా భాజపా రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడైన రామ్‌ ఇక్బాల్‌ సింగ్‌ యోగి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మొదటి వేవ్‌ నుంచి పాఠాలు నేర్చుకోలేకపోవడం వల్లే రెండో వేవ్‌లో ఊరికి 10 మంది చొప్పున ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

‘‘కొవిడ్‌ కట్టడి విషయంలో మొదటి వేవ్‌ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేకపోయింది. దీంతో రెండో వేవ్‌లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. ప్రతి ఊరిలోనూ 10 మంది వరకు మరణించారు’’ అని రామ్‌ ఇక్బాల్‌ సింగ్‌ అన్నారు. కొవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ₹10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా 34 లక్షల జనాభా కలిగిన ఈ జిల్లాలో సరైన వైద్య సదుపాయాలు లేవని విమర్శించారు. గతంలోనూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కొవిడ్‌ విషయంలో సర్కారుపై విమర్శలు చేశారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు రావడం భాజపాకు మింగుడుపడని విషయం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని